శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 13 మే 2022 (10:04 IST)

ఫోటోగ్రాఫర్‌ హత్య అందుకే.. వీడియో కాల్ చేస్తుంది కానీ.. పెళ్లి చేసుకోమన్నందుకు.. ?

murder
హైదరాబాద్ మీర్ పేటలో హత్యకు గురైన ఫోటోగ్రాఫర్ కేసును పోలీసులు చేధించారు. ప్రధాన నిందితురాలైన ఓ మహిళతో పాటు ఆమెకు సహకరించిన మరో ఇద్దరు వ్యక్తులను అరెస్ట్‌ చేశారు.
 
న్యూడ్ ఫోటోలతో తనను బ్లాక్ చేయించినందునే అతనిని హత్య చేసినట్లుగా ప్రియురాలు అంగీకరించింది. బాగ్ అంబర్ పేట ప్రాంతానికి చెందిన యశ్విన్‌ కుమార్‌.. శ్వేతా రెడ్డితో 2018లో ఫేస్ బుక్ ద్వారా పరిచయం ఏర్పడింది. వీరిద్దరి ఫేస్ బుక్ స్నేహం కొంత కాలం తరువాత వివాహేతర సంబంధానికి దారి తీసింది. 
 
ఈ క్రమంలో వారి మధ్య న్యూడ్‌ వీడియో కాలింగ్‌ కొనసాగేది. అయితే తాజాగా తనను పెళ్లి చేసుకోవాలని శ్వేతారెడ్డిపై యశ్విన్‌ కుమార్‌ ఒత్తిడి తెచ్చాడు. 
 
లేకపోతే వివాహేతర సంబంధాన్ని బయట పెడతానని బెదిరించాడు. దీంతో వేధింపులు తాళలేక తన ప్రియుడు.. మరో ఇద్దరితో కలిసి చంపించినట్లు శ్వేతారెడ్డి ఒప్పుకుంది. దీంతో రాచకొండ పోలీసులు ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు.