గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : బుధవారం, 17 మార్చి 2021 (16:50 IST)

తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు కేసీఆర్ గుడ్ న్యూస్.. కాలర్ ఎత్తుకుని..?

తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు ముఖ్యమంత్రి కేసీఆర్ శుభవార్త చెప్పారు. శాసనసభ వేదికగా రెండు, మూడు రోజుల్లో గౌరవప్రదమైన పీఆర్సీ ప్రకటిస్తామని స్పష్టం చేశారు.

ఉద్యోగులమీద తమకెంత ప్రేమ ఉందో గత పీఆర్సీతోనే చూపించామన్న కేసీఆర్ ఉద్యోగులు కాలర్ ఎత్తుకుని దేశంలోనే అత్యధిక జీతాలు పొందుతున్నామని చెప్పుకునే విధంగా జీతాలు ఇస్తామన్నారు. 
 
ఎమ్మెల్సీ ఎన్నికలు ముగిసిన నేపథ్యంలో పీఆర్సీ ప్రకటిస్తామన్నారు. సచివాలయంలోని ప్రార్థనా మందిరాల్ని అదే ప్రాంతంలో నిర్మిస్తామని స్పష్టం చేశారు ముఖ్యమంత్రి కేసీఆర్.

సెక్రటేరియట్ నిర్మాణంలో భాగంగా ఆలయాలు ధ్వంసం అయిన మాట వాస్తవమే అన్న కేసీఆర్ అదేస్థానంలో ఆలయాలను తిరిగి నిర్మిస్తామన్నారు.