సోమవారం, 2 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : శనివారం, 7 అక్టోబరు 2023 (13:08 IST)

షార్ట్ సర్క్యూట్ : కేపీహెచ్ బీ మెట్రో స్టేషన్ వద్ద అగ్నిప్రమాదం

fire accident
షార్ట్ సర్క్యూట్ కారణంగా హైదరాబాదులో కేపీహెచ్ బీ మెట్రో స్టేషన్ వద్ద అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఓ ఫర్నిచర్ మాల్‌లో భారీ అగ్నిప్రమాదం సంభవించడంతో ఎగసిపడిన మంటలు క్షణాల్లో మెట్రో స్టేషన్‌కు అంటుకున్నాయి. 
 
ఫర్నిచర్ మాల్ లోని మూడో అంతస్థులో మొదట మంటలు చెలరేగినట్టు తెలిసింది. ఫర్నిచర్ మాల్‌లోని మూడో అంతస్తులో మొదట మంటలు చెలరేగినట్టు తెలిసింది. షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ అగ్నిప్రమాదం జరిగినట్టు భావిస్తున్నారు. 
 
ఈ అగ్నిప్రమాదంలో భారీ ఆస్తి నష్టం సంభవించినట్టు అంచనా వేస్తున్నారు. మెట్రో స్టేషన్ ఎస్కలేటర్ మెట్ల మీదుగా పైకి చేరుకుని మంటలు ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు. 
 
దీనిపై సమాచారం అందుకున్న అగ్నిమాపక శాఖ సిబ్బంది నాలుగు ఫైరింజన్లతో మంటలు ఆర్పేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు.