గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఐవీఆర్
Last Modified: శుక్రవారం, 25 సెప్టెంబరు 2020 (22:00 IST)

నన్ను చంపకుండా మా నాన్న తప్పు చేశాడు, ఆయన తన చావు కొనితెచ్చుకున్నట్లే...

హైదరాబాదు గచ్చిబౌలిలో చోటుచేసుకున్న దారుణ పరువు హత్యపై మృతుడు హేమంత్ భార్య అవంతి మీడియాతో మాట్లాడుతూ, నన్ను చంపకుండా మా నాన్న తప్పు చేశాడు, చావు కొనితెచ్చుకున్నట్లేనంటూ వ్యాఖ్యానించింది. మా నాన్న పరువు తీసినందుకు నన్ను చంపాల్సింది, అంతేకానీ హేమంత్‌ను చంపే హక్కు ఆయనకు ఎక్కడిది అంటూ ప్రశ్నించింది.
 
మా నాన్న ల‌క్ష్మారెడ్డికి గతంలో అమృత తండ్రి మారుతీరావుకి ఎలాంటి గతి పట్టిందో అదే గతి పడుతుందంటూ వ్యాఖ్యానించింది. ప్రేమించి పెళ్లి చేసుకున్న తర్వాత తన పేరపై వున్న ఆస్తినంతా నాన్నకు రాసిచ్చాననీ, అదంతా అయిపోయాక ఇలా ప్లాన్ ప్రకారం హత్య చేయించడం ఘోరమంటూ చెప్పుకొచ్చింది. కాగా ఈ కేసుకు సంబంధించి ఇప్పటివరకూ 13 మందిని పోలీసులు అరెస్టు చేశారు.