శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : బుధవారం, 21 అక్టోబరు 2020 (15:34 IST)

హేమంత్ పరువు హత్య.. ఫాస్ట్‌కోర్టు ఏర్పాటు చేసేలోపు దర్యాప్తు పూర్తి..

రాష్ట్రంలో సంచలనం సృష్టించిన హేమంత్ పరువు హత్యకు సంబంధించి పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. ఇప్పటికే సుపారీ ముఠాకు చెందిన ఇద్దరితోపాటు 12 మందిని కస్టడీలోకి తీసుకొని విచారించారు. హత్య కేసులో క్రైమ్‌ రీకన్‌స్ట్రక్షన్‌ సైతం పూర్తి చేశారు. కేసు దర్యాప్తు బృందంలో ఒకరైన గచ్చిబౌలి ఇన్‌స్పెక్టర్‌ కొవిడ్‌ బారినపడటంతో దర్యాప్తు బాధ్యతలను రాయదుర్గం ఇన్‌స్పెక్టర్‌కు అప్పగించారు.
 
ఫాస్ట్‌కోర్టు ఏర్పాటు చేసేలోపు దర్యాప్తు పూర్తి చేస్తామని, నిందితులకు త్వరగా శిక్షపడేలా చూస్తామని మాదాపూర్‌ డీసీపీ వెంకటేశ్వర్‌రావు తెలిపారు. ఈ కేసులో నిందితులను కఠినంగా శిక్షించాలని హేమంత్‌ భార్య అవంతితోపాటు అతడి కుటుంబ సభ్యులు ఇటీవల పోలీసులను కోరారు. 
 
హైదరాబాద్ సీపీ సజ్జనార్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. తనతోపాటు హేమంత్‌ కుటుంబసభ్యులకు ప్రాణహాని ఉందని.. భద్రత కల్పించాలని అవంతి సీపీని కోరింది. స్పందించిన ఆయన చందానగర్‌లో హేమంత్‌ ఇంటివద్ద భద్రత కల్పించిన విషయం తెలిసిందే.