హమ్మయ్య! కేసీఆర్ కనిపించారు!!

శనివారం, 11 జులై 2020 (20:34 IST)
ఎన్నో అనుమానాలు, మరెన్నో సందేహాల నడుము రెండు వారాలుగా ఎర్రబెల్లి ఫాంహౌస్ లో వుంటున్న తెలంగాణ సీఎం కేసీఆర్.. ఎట్టకేలకు శనివారం ప్రగతి భవన్ వచ్చారు. రాష్ట్రంలో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో కేసీఆర్ కనబడలేదనే వార్తలు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి.

అంతేకాదు ఏకంగా ఇద్దరు యువకులు ప్రగతిభవన్‌లోకి దూసుకుపోయి ‘‘సీఎం కేసీఆర్ ఎక్కడ?.. ఆయన మా సీఎం. ఆయన ఎక్కడ ఉన్నడో తెలుసుకోవడం మా హక్కు’’ అంటూ ఇంగ్లీష్‌లో రాసిన ప్లకార్డును ప్రదర్శించి వెళ్లిపోయారు.

మరోవైపు తెలంగాణ సీఎం కేసీఆర్‌ ఎక్కడ? ఆయన ఆరోగ్య పరిస్థితి ఏమిటి? అని ప్రశ్నిస్తూ తీన్మార్‌ మల్లన్న (నవీన్) హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు.

‘‘ఈ విషయంలో ఎలాంటి ఆందోళన అవసరం లేదు. ఏదైనా తెలియజేయాలనుకుంటే, సంబంధిత యంత్రాంగం సరైన సమయానికి తెలియజేస్తుంది’’అని సీజే రాఘవేంద్ర సింగ్‌ చౌహాన్‌ వ్యాఖ్యానించారు. రాజకీయపరమైన గిమ్మిక్కులు ఉన్నందువల్లే లంచ్‌ మోషన్‌ పిటిషన్‌కు అనుమతించలేదని పేర్కొన్నారు. 

అన్నీ చూడండి

జానకమ్మ గారి మరణవార్త నా హృదయాన్ని ఎంతో కలచివేసింది: మెగాస్టార్ చిరంజీవి

Pawan Kalyan surgery: పవన్ కళ్యాణ్ కి మూడున్నర గంటలపాటు శస్త్ర చికిత్స

అఖిల్ హిట్టు కొట్టాడు అని అందరూ అంటుంటే ఆనందంగా ఉంది

Ramya Krishna : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి లక్ష్మి ప్రణతి పాత్రలో రమ్యకృష్ణ

ఏడుగురు మహిళల జీవితాల చుట్టూ తిరిగే ఈ కథ తో హ్యాపీ జర్నీ

తర్వాతి కథనం
Show comments