గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : గురువారం, 23 నవంబరు 2023 (17:13 IST)

పిచ్చిపిచ్చిగా మాట్లాడొద్దు.. కేటీఆర్ ఆడియో లీక్

ktrao
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం సమీపిస్తోంది. మరో ఐదు రోజుల్లో ప్రచారం ముగియనుంది. దీంతో అన్ని రాజకీయ పార్టీలు జోరుగా ప్రచారం చేస్తున్నాయి. బీఆర్‌ఎస్‌ను గద్దె దించి ఈసారి అధికారంలోకి రావాలని కాంగ్రెస్, బీజేపీలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. ఇలాంటి క్లిష్ట సమయంలో మంత్రి కేటీఆర్ ఫోన్ కాల్ రికార్డ్ లీక్ అయింది. రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం రేపుతోంది. 
 
ఆ కాల్‌లో ఏం చెప్పారు? ఈ ఆడియోలో నాలుగైదు రోజుల్లో ప్రచారానికి తెరపడుతుందని, ఈ క్రమంలో సిరిసిల్ల నియోజకవర్గంలోని ఇంటింటికీ వెళ్లి ప్రతి ఇంటికి వెళ్లాలని సూచించారు. ఎక్కడా అధైర్యపడవద్దని, పార్టీ నేతలు పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారని ఆయన సూచించారు. మనల్ని మనం తగ్గించుకోకూడదు. ప్రచారానికి ఇంకా వారం రోజుల సమయం ఉందని, ప్రతి ఒక్కరూ ప్రతి గ్రామంలో ఇంటింటికీ వెళ్లాలని సూచించారు.
 
సిరిసిల్ల బీఆర్‌ఎస్‌ నేతలతో మంత్రి కేటీఆర్‌ మాట్లాడిన ఆడియో వైరల్‌గా మారింది. కాంగ్రెస్ గ్రాఫ్ పెరుగుతోందని బీఆర్ఎస్ నేతలు ప్రచారం చేస్తున్నారని మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. సిరిసిల్లలో కేటీఆర్ ఓడిపోతున్నారని ఎవరో రాశారని పేర్కొన్నారు. 
 
ఎన్నికలు ముగిసిన వెంటనే సిరిసిల్లకు వస్తానని నేతలకు కేటీఆర్ హామీ ఇచ్చారు. ప్రజలను చైతన్యవంతులను చేయకుంటే నష్టపోయేది మనమేనన్నారు. ఇప్పుడు ఈ కాల్ రికార్డింగ్ విపక్షాలకు ప్రచార సాధనంగా మారినట్లు తెలుస్తోంది.