1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By pnr
Last Updated : సోమవారం, 2 జనవరి 2017 (10:48 IST)

ఒక్క రోజే రూ.74 కోట్లకు మద్యం తాగేశారు... ఏమాత్రం చూపించని నోట్ల రద్దు ప్రభావం

కొత్త సంవత్సర వేడుకలపై కరెన్సీ కష్టాలు ఏమాత్రం ప్రభావం చూపలేదు. ఫలితంగా మద్యం అమ్మకాల్లో అదే జోష్‌ కనిపించింది. 2016 సంవత్సరానికి వీడ్కోలు పలుకుతూ... 2017 సంవత్సరానికి స్వాగతం చెబుతూ మందుబాబులు ‘పండగ’

కొత్త సంవత్సర వేడుకలపై కరెన్సీ కష్టాలు ఏమాత్రం ప్రభావం చూపలేదు. ఫలితంగా మద్యం అమ్మకాల్లో అదే జోష్‌ కనిపించింది. 2016 సంవత్సరానికి వీడ్కోలు పలుకుతూ... 2017 సంవత్సరానికి స్వాగతం చెబుతూ మందుబాబులు ‘పండగ’ చేసుకున్నారు. ఎక్కడ చూసినా మద్యం షాపుల వద్ద రాత్రి 12 గంటల వరకు క్యూలే క్యూలు. 
 
దీంతో డిసెంబరు 31వ తేదీన ఏకంగా రూ.74 కోట్ల మద్యం అమ్మకాలు జరిగాయి. స్వైపింగ్‌ మిషన్లు ఉన్న మద్యం షాపుల్లో కొంత ఎక్కువ అమ్మకాలు జరిగాయి. పెద్ద నోట్లను రద్దు చేయకుంటే మద్యం అమ్మకాలు ఇంకా ఎక్కువగానే ఉండేవని అధికారులు భావిస్తున్నారు. రాష్ట్రంలో 2,144 మద్యం షాపులు, 853 బార్లు, 27 క్లబ్బులు ఉన్నాయి. 
 
ఈసారి ఎక్సైజ్‌ శాఖ మద్యం విక్రయ వేళల్లో సడలింపునిచ్చింది. మద్యం షాపుల్లో రాత్రి 12 గంటల వరకు, బార్లు, క్లబ్బులు, టూరిజం కార్పొరేషన్ హోటళ్లలో రాత్రి ఒంటి గంట వరకు మద్యం విక్రయాలకు అనుమతించింది. దాంతో రాత్రి 7.30 గంటల నుంచి ఒంటి గంట వరకు మద్యం అమ్మకాలు విపరీతంగా సాగాయి. వాస్తవానికి గత ఏడాది డిసెంబరు 31న కూడా రూ.74 కోట్ల విక్రయాలే సాగాయి. కానీ, ఈసారి పెద్ద నోట్లు రద్దయిన నవంబర్‌ 8 నుంచి విక్రయాలు కొంత మందగించాయి.