మంగళవారం, 7 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : సోమవారం, 16 మే 2022 (14:47 IST)

ఒళ్లు గగుర్పొడిచే రోడ్డు ప్రమాదం.. తల, మొండెం వేరు అయ్యాయి

road accident
మహబూబాబాద్ జిల్లాలో ఒళ్లు గగుర్పొడిచే ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఓ వ్యక్తి అక్కడిక్కడే మృతి చెందాడు. 
 
వివరాల్లోకి వెళితే.. మహబూబాబాద్ జిల్లాలోని కురవి మండలం అయ్యగారిపల్లి గ్రామ శివారులో తెల్లవారుజామున ఈ రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.
 
గుర్తు తెలియని ఓ లారీ బైక్ ను ఢీకొట్టడంతో బైక్‌పై ప్రయాణిస్తున్న వ్యక్తి తల, మొండెం వేరు అయ్యాయి దీంతో ఆ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. 
 
మృతి చెందిన వ్యక్తి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలం రాజారామ్ తండాకు చెందిన బానోత్ రవి గా గుర్తించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.