సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : సోమవారం, 29 మే 2023 (14:22 IST)

చేతబడి.. పసుపు, సూదులతో కూడిన బొమ్మ.. భయం భయం

black magic
మహబూబాబాద్ డోర్నకల్ మండలం పెరుమాండ్ల సుంకిశ గ్రామంలో ఓ గ్రామస్థుడి ఇంటి ముందు గుర్తుతెలియని వ్యక్తులు చేతబడి చేయడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కిన్నెర మధు నివాసంలో దుండగులు చేతబడులు చేశారని తెలుస్తోంది. పసుపు, సూదులతో కూడిన బొమ్మను కనుగొనడంతో నివాసితులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. 
 
ఇలాంటి ఘటనలు జరగడం ఇది తొలిసారి కాదని గ్రామస్థులు అంటున్నారు. ఎందుకంటే గ్రామంలో గతంలో అనేక సార్లు చేతబడి సంఘటనలు జరిగాయని చెప్తున్నారు. పోలీసులు ఇటువంటి పద్ధతుల వల్ల కలిగే ప్రమాదాల గురించి నివాసితులకు అవగాహన కల్పించడానికి చర్యలు చేపట్టారు.