1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By వరుణ్
Last Updated : బుధవారం, 12 ఏప్రియల్ 2023 (11:12 IST)

మయన్మార్‌లో సైనికుల మారణహోమం - వందమంది మృతి

Myanmar
Myanmar
మయన్మార్‌లో ఆ దేశ సైన్యం మారణహోమం సృష్టిస్తుంది. గత 2021లో ప్రజా ప్రభుత్వంపై తిరుగుబాటు చేసి అధికారాన్ని దక్కించుకున్న మయన్మార్ సైన్యం.. ఆ తర్వాత ఇష్టారాజ్యంగా సైనిక దాడులు చేస్తూ అనేక మంది ప్రాణాలను హరిస్తుంది. ఫలితంగా ఇప్పటివరకు మూడు వేల మంది వరకు ప్రాణాలు కోల్పోయారు. 
 
తాజాగా జరిగిన సైనిక దాడుల్లో మరో వంది చనిపోయారు. ప్రతిపక్ష కార్యాక్రమాన్ని లక్ష్యంగా చేసుకుని ఈ వైమానిక దాడి జరిగింది. ఫలితంగా వంద మంది వరకు చనిపోగా, వీరిలో అనేక మంది చిన్నారులు, మహిళలు కూడా ఉన్నారు. 
 
ప్రజా ప్రభుత్వాన్ని కూల్చివేసి గత 2021లో సైన్యం అధికారాన్ని దక్కించుకుంది. అప్పటి నుంచి తమను వ్యతిరేకించే వారిపై ఉక్కుపాదం మోపుతోంది. ఇందులోభాగంగా, విచక్షణారహితంగా దాడులు చేయిస్తుంది. దీంతో మూడు వేల మంది ప్రాణాలు కోల్పోయారు. 
 
తాజాగా మాండలేకు 110 కిలోమీటర్ల దూరంలో ఉన్న పజిగ్గీ గ్రామంలో సైనిక పాలనను వ్యతిరేకించే ప్రతిపక్షం మంగళవారం ఓ కార్యక్రమం నిర్వహించింది. ఇందులో 150 మంది వరకు పాల్గొన్నారు. వీరిని లక్ష్యంగా చేసుకుని మయన్మార్ సైనికులు దాడి చేయగా, వంద మంది వరకు చనిపోయారు.