బుధవారం, 8 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 21 సెప్టెంబరు 2021 (15:06 IST)

పాత‌బ‌స్తీలో వ్యక్తి దారుణ హత్య-శ‌రీరంపై దుస్తులు లేని స్థితిలో?

హైదరాబాదులో నేరాల సంఖ్య పెరిగిపోతున్నాయి. న‌గ‌రంలోని పాత‌బ‌స్తీలో ఓ వ్య‌క్తి దారుణ హ‌త్య‌కు గుర‌య్యాడు. చాంద్రాయ‌ణ‌గుట్ట ప‌రిధిలోని బండ్ల‌గూడ‌లోని ఓ రోడ్డుపై వ్య‌క్తి మృత‌దేహం ల‌భ్య‌మైంది. స‌మాచారం అందుకున్న పోలీసులు ఘ‌ట‌నాస్థ‌లికి చేరుకున్నారు. ఆ ప‌రిస‌రాల‌ను పోలీసులు క్షుణ్ణంగా ప‌రిశీలించారు. 
 
వ్య‌క్తి మృత‌దేహంపై క‌త్తిపోట్లు ఉన్న‌ట్లు పోలీసులు గుర్తించారు. శ‌రీరంపై దుస్తులు లేని స్థితిలో మృత‌దేహం ల‌భ్య‌మైంది. ఆ డెడ్‌బాడీ ప‌క్క‌నే ఓ పాయింట్, టీష‌ర్ట్ ల‌భ్య‌మ‌య్యాయి. కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు.