1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By PNR
Last Updated : శుక్రవారం, 28 నవంబరు 2014 (10:32 IST)

తెలంగాణాలో నియంత పాలన సాగుతోంది : మావోయిస్టు గణపతి!

కొత్తగా ఏర్పాటైన తెలంగాణా రాష్ట్రంలో నియంత పాలన సాగుతోందని మావోయిస్టు ప్రధాన కార్యదర్శి గణపతి పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన పేరుమీద విడుదలైన లేఖలో ఈ విషయాన్ని ప్రస్తావించారు. కొత్తగా ఏర్పాటైన రాష్ట్రంలో పాలన పగ్గాలు చేపట్టిన సీఎం కేసీఆర్ నియంతలా వ్యవహరిస్తున్నారని ఆయన ఆరోపించారు. 
 
రాష్ట్రంలో జరగుతున్న రైతు ఆత్మహత్యలకు కేసీఆర్ సర్కారే బాధ్యత వహించాల్సి ఉందన్నారు. ఆత్మహత్యలకు పాల్పడ్డ రైతు కుటుంబాలకు రూ.10 లక్షల పరిహారం అందజేయాలని డిమాండ్ చేశారు. ప్రజా ఉద్యమాలను అణచివేసేందుకు పోలీసులకు కోట్లాది రూపాయలను ప్రభుత్వం కేటాయిస్తోందని గణపతి ఆరోపించారు. పౌర హక్కుల సంఘం నేత వరవరరావు ఇంటిపై దాడిని ఖండిస్తున్నామని పేర్కొన్నారు. 
 
తెలంగాణాలోని ప్రజా ప్రతినిధులకు మావోయిస్టుల నుంచి ముప్పు ఉందన్న నిఘా వర్గాల హెచ్చరికలతో బుల్లెట్ ఫ్రూప్ వాహనాలను సమకూర్చేందేకు తెలంగాణ ప్రభుత్వం సంసిద్ధత వ్యక్తం చేయడాన్ని ఆయన తప్పుబట్టారు. అలాగే, తెలంగాణా రాష్ట్రం ఏర్పాటైన సీమాంధ్ర పెట్టుబడిదారుల ఆధిపత్యం, దోపిడీలు ఇంకా కొనసాగుతున్నాయని వీటికి అడ్డుకట్ట వేయాలని గణపతి పేరుమీద విడుదలైన లేఖలో పేర్కొన్నారు.