నవంబరులోనే ముందస్తు ఎన్నికలు : కడియం శ్రీహరి
సాధారణ ఎన్నికలు ఏప్రిల్-మే నెలల్లో జరగాల్సి ఉన్నా, నవంబరు- డిసెంబరులోనే ముందస్తు ఎన్నికలు వచ్చే అవకాశముందని తెలంగాణా ఉపయుఖ్యమంత్రి కడియం శ్రీహరి వెల్లడించారు. పార్టీ శ్రేణులు అందరూ సమన్వయంతో పనిచేయాలన
సాధారణ ఎన్నికలు ఏప్రిల్-మే నెలల్లో జరగాల్సి ఉన్నా, నవంబరు- డిసెంబరులోనే ముందస్తు ఎన్నికలు వచ్చే అవకాశముందని తెలంగాణా ఉపయుఖ్యమంత్రి కడియం శ్రీహరి వెల్లడించారు. పార్టీ శ్రేణులు అందరూ సమన్వయంతో పనిచేయాలని, కొత్త పాతల నేతల మధ్య విబేధాలు లేకుండా చూసుకోవాలని కోరారు. ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి పథకాలలో వేగం పెంచి అక్టోబర్ 11 నాటికి వరంగల్ ఉమ్మడి జిల్లాలో ప్రతి ఇంటికి సురక్షిత నీరందించాలని ఆదేశించారు.
రాష్ట్రంలో ప్రజలు మరోసారి ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వాన్ని కోరుకుంటున్నారని తెలిపారు. ప్రభుత్వ పథకాల పట్ల ప్రజల్లో చాలా సానుకూలత ఉందన్నారు. పథకాలు, పార్టీ పట్ల ఉన్న అనుకూలతను నాయకులు తమకు అనుకూలంగా మార్చుకోవాలని కోరారు. ప్రజల ఆశీర్వాదంతో వరంగల్‌లో 12 అసెంబ్లీ, రెండు పార్లమెంట్ సీట్లను గెలిచి సీఎంకు కానుకగా ఇద్దమంటూ వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండలో జరిగిన పార్టీ శ్రేణుల సమావేశంలో పిలుపునిచ్చారు.