శుక్రవారం, 3 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : శనివారం, 7 మే 2022 (17:18 IST)

కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డితో మంత్రి రోజా భేటీ..

RK ROja
RK ROja
కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డితో ఏపీ ప‌ర్యాట‌క శాఖ మంత్రి రోజా భేటీ అయ్యారు. రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రిగా ప‌ద‌వీ బాధ్య‌త‌లు చేప‌ట్టిన త‌ర్వాత ఆర్కే రోజా ప‌లువురు ప్ర‌ముఖుల‌ను వ‌రుస‌బెట్టి క‌లుస్తున్నారు. 
 
ఇప్పటికే తెలంగాణ సీఎం కేసీఆర్, మెగాస్టార్ చిరంజీవిని కలిశారు. ఈ క్రమంలో శ‌నివారం విశాఖ వ‌చ్చిన కేంద్ర ప‌ర్యాట‌క శాఖ మంత్రి కిష‌న్ రెడ్డితోనూ ఆమె భేటీ అయ్యారు. 
 
అధికారిక ప‌ర్య‌ట‌న నిమిత్తం విశాఖ వ‌చ్చిన కిష‌న్ రెడ్డికి విమానాశ్ర‌యంలో రోజా ఘ‌న స్వాగ‌తం ప‌లికారు. ఈ సంద‌ర్భంగా ఏపీలోని ప‌ర్యాట‌క ప్రాంతాల అభివృద్ధిపై వారిద్ద‌రూ చ‌ర్చించారు.