గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ivr
Last Modified: శుక్రవారం, 10 మార్చి 2017 (21:41 IST)

మోత్కుపల్లి తెదేపాకు షాకిస్తారా...? కేసీఆర్‌తో మంతనాలేంటి?

తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు మోత్కుపల్లి నరసింహులు తెదేపాకు షాక్ ఇచ్చే పని చేయనున్నారనే వార్తలు వస్తున్నాయి. ఆయన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ను శుక్రవారం నాడు క్యాంపు కార్యాలయంలో కలిసి పలు కీలక విషయాలపై మాట్లాడినట్లు సమాచారం. ఐతే ఈ భేటీ వెనుక వే

తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు మోత్కుపల్లి నరసింహులు తెదేపాకు షాక్ ఇచ్చే పని చేయనున్నారనే వార్తలు వస్తున్నాయి. ఆయన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ను శుక్రవారం నాడు క్యాంపు కార్యాలయంలో కలిసి పలు కీలక విషయాలపై మాట్లాడినట్లు సమాచారం. ఐతే ఈ భేటీ వెనుక వేరే కారణం వుందని తెదేపా శ్రేణులు చెపుతున్నాయి. మోత్కుపల్లి కేవలం తన కుమార్తె పెళ్లి పత్రికను ఇచ్చేందుకే వెళ్లారని అంటున్నాయి. కానీ నరసింహులు మాత్రం నోరు మెదపడం లేదు.
 
కొంతకాలంగా ఆయనకు గవర్నర్ పోస్టు లభిస్తుందని వేచి చూసి, తెదేపాతో విసిగిపోయి తెరాస గూటికి వెళ్లాలనే ఆలోచనలో వున్నారన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మోత్కుపల్లి నిజంగా పార్టీ మారుతారా లేదంటే అంతా ఊహాగానాలకే పరిమితమవుతుందా చూడాల్సి వుంది.