సోమవారం, 25 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By
Last Updated : సోమవారం, 18 మార్చి 2019 (10:01 IST)

సీఎం కేసీఆర్ కుమార్తె కవితపై వెయ్యి మంది రైతుల పోటీ

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె కె.కవితపై వెయ్యి మంది రైతులు పోటీ చేయనున్నారు. ఈ మేరకు రైతుల సంఘాలు నిర్ణయం తీసుకున్నాయి. వచ్చే నెల 11వ తేదీన తెలంగాణ రాష్ట్రంలో లోక్‌సభ ఎన్నికల పోలింగ్ జరుగనుంది. ఈ ఎన్నికల్లో నిజామాబాద్ లోక్‌సభ స్థానం నుంచి కె.కవిత తెరాస అభ్యర్థిగా పోటీ చేయనున్నారు. 
 
ఇపుడు ఈ స్థానం ఎన్నిక రసవత్తరంగా మారింది. దీనికి కారణం స్థానిక రైతులే. కవితపై పోటీ చేసేందుకు ఏకంగా వెయ్యిమంది సిద్ధమయ్యారు. కవితపై పోటీకి దిగబోతున్నవారందరూ రైతులు కావడం గమనార్హం. కవితపై తమ నిరసనను తెలిపేందుకు ఈ సరికొత్త పంథాను ఎంచుకున్నారు.
 
పసుపు, ఎర్రజొన్నకు మద్దతు ధర కోసం డిమాండ్ చేస్తున్న వీరంతా కవితపై మూకుమ్మడిగా పోటీకి దిగాలని రైతు సంఘాలు తీర్మానించాయి. కనీసం 500 నుంచి వెయ్యి వరకు నామినేషన్లు దాఖలు చేయాలని రైతులు నిర్ణయించారు. ఈ నేపథ్యంలో నిజామాబాద్ ఎన్నిక రసవత్తరంగా మారనుంది.