శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By కుమార్
Last Updated : గురువారం, 14 మార్చి 2019 (16:28 IST)

మోదీకి పోటీగా బరిలోకి దిగనున్న 111మంది తమిళనాడు రైతులు

ప్రధాని మోదీపై తమిళనాడు రైతులు మళ్లీ భగ్గుమన్నారు. మోదీ రైతుల డిమాండ్లను ఒక్కటి కూడా పరిష్కరించలేదని మండిపడ్డారు. ఢిల్లీలో 140 రోజులపాటు ఆందోళనలు చేసినా కూడా తమ గోడు పట్టించుకోలేదని వాపోయారు.
 
జాతీయ దక్షిణ భారత నదుల అనుసంధాన రైతుల సంఘం అధ్యక్షుడు అయ్యాకణ్ణు బుధవారం తిరుచ్చిలో విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ బీజేపీ మానిఫెస్టోలో పంటలకు మద్దతు ధర, పంట రుణాల రద్దు, రైతులకు ఫించన్లు, వ్యక్తిగత బీమా అందించే విషయాలను చేర్చాలని డిమాండ్ చేసారు.
 
ఇలా చేయని పక్షంలో జరగబోయే లోక్‌సభ ఎన్నికల్లో నరేంద్రమోదీ ఎక్కడెక్కడ పోటీ చేస్తాడో అన్ని చోట్లా 111 మంది తమిళనాడు రైతులను బరిలోకి దించి, మోదీని ఓడించి తీరుతామని హెచ్చరించారు. అవసరమైతే మళ్లీ ఢిల్లీకి వచ్చి ఆందోళనలు చేస్తామని కూడా పేర్కొన్నారు.