శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By జె
Last Modified: బుధవారం, 7 ఏప్రియల్ 2021 (18:12 IST)

నా భార్య కంటే నువ్వే బ్యూటీగా వున్నావంటూ యువతిని వలలో వేసిన కానిస్టేబుల్, దొరికిపోయాడు

పదిమందికి మంచి చెప్పాల్సిన ఆ కానిస్టేబుల్ పెడదారి పట్టాడు. పెళ్ళయినా సరే అక్రమ సంబంధం కోసం పాకులాడాడు. నా భార్య కన్నా నువ్వే బాగున్నావంటూ ఒక యువతికి మాయమాటలు చెప్పి శారీరకంగా దగ్గరయ్యాడు. భర్త నిర్వాకం తెలిసిన భార్య అతన్ని రెడ్ హ్యాండెండ్‌గా పోలీసు ఉన్నతాధికారులు పట్టించింది.
 
వరంగల్ పోలీసు కమిషనరేట్ పరిధిలో పనిచేస్తున్న ఒక కానిస్టేబుల్‌కు 40 యేళ్ళు. 18 యేళ్ళ క్రితమే వివాహమైంది. పెళ్ళీడుకొచ్చిన కూతురు ఉంది. అయితే ఆ వయస్సులో కూడా అతనికి అక్రమ సంబంధంపై మోజు పుట్టింది. అంతే... ఒక యువతికి మాయమాటలు చెప్పాడు. 
 
తన ఇంటికి సమీపంలో ఉన్న యువతి ఆమె. చదువుకుంటున్న ఆ యువతికి మాయమాటలు బాగానే చెప్పాడు. దీంతో ఆమె నమ్మేసింది. అతనికి లొంగిపోయింది. ఇదే అతనికి బాగా కలిసొచ్చింది. విధులు పూర్తయినా ఇంటికి రాని భర్తపై అనుమానం పడింది భార్య.
 
అతను చేస్తున్న పని తెలుసుకుని ఆశ్చర్యపోయింది. తన భర్త పనిచేసే పోలీసు స్టేషన్‌కు వెళ్ళి ఉన్నతాధికారులకు విషయం చెప్పింది. నా భర్త అతని ప్రియురాలి ఇంటిలో ఉన్నాడని చెప్పి నేరుగా తీసుకెళ్ళి తలుపులు కొట్టింది. ఇంకేముంది కానిస్టేబుల్ అక్కడే ఉన్నాడు. అడ్డంగా బుక్కయ్యాడు.