మంగళవారం, 21 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : శనివారం, 22 జనవరి 2022 (11:11 IST)

తెలంగాణకు మళ్లీ రెయిన్ అలెర్ట్: రైతులకు అలెర్ట్

తెలంగాణకు మళ్లీ రెయిన్ అలెర్ట్ వచ్చింది. తెలంగాణలో మళ్లీ వర్షాలు కురిసే అవకాశం ఉన్ ట్లు వాతావరణ శాఖ పిడుగులాంటి వార్త చెప్పింది. 
 
రాష్ట్రంలో రేపటి నుంచి మూడు రోజుల పాటు తేలికపాటి, ఓ మోస్తారు వానలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.
 
కొన్ని చోట్ల ఉరుములు, మెరుపులతో కూడా వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. కొన్ని ప్రాంతాల్లో రాత్రిపూట ఉష్ణోగ్రతలు తగ్గడం వల్ల చలి తీవ్రత పెరుగుతోందని చెప్పారు.