1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By pnr
Last Updated : గురువారం, 13 అక్టోబరు 2016 (17:38 IST)

కూతురు కువైట్.. కుమారుడు యుఎస్... తండ్రి ఫాంహౌస్.. ఇదీ తెలంగాణ పాలన : రావుల ఫైర్

తెలంగాణ రాష్ట్రంలో తెరాస ప్రభుత్వ పాలనపై ఆ ప్రాంత సీనియర్ నేత రావుల చంద్రశేఖర్ రెడ్డి తనదైనశైలిలో స్పందించారు. కుమార్తె కువైట్ వెళితే... తనయుడు అమెరికాకు, తండ్రి ఫాంహౌస్‌కు వెళ్ళారని ఎద్దేవా చేశారు. ఇ

తెలంగాణ రాష్ట్రంలో తెరాస ప్రభుత్వ పాలనపై ఆ ప్రాంత సీనియర్ నేత రావుల చంద్రశేఖర్ రెడ్డి తనదైనశైలిలో స్పందించారు. కుమార్తె కువైట్ వెళితే... తనయుడు అమెరికాకు, తండ్రి ఫాంహౌస్‌కు వెళ్ళారని ఎద్దేవా చేశారు. ఇక రాష్ట్ర‌ ప్రజలకు దిక్కెవరని ఆయ‌న ఎద్దేవా చేశారు. 
 
ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ జీహెచ్ఎంసీ దివాలా తీసేలా టీఆర్ఎస్ స‌ర్కారు వ్య‌వ‌హ‌రిస్తోంద‌ని ఆయ‌న అన్నారు. రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ, విద్యార్థుల‌కు ఫీజు రీయింబర్స్‌మెంట్ కోసం నిధులు ఎందుకు విడుద‌ల చేయడం లేదని ఆయ‌న ప్ర‌శ్నించారు.
 
తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ప్ర‌భుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. పేద‌లకు డ‌బుల్ బెడ్ రూములు క‌ట్టిస్తాన‌ని చెప్పిన స‌ర్కారు అందుకోసం నిధులు ఎందుకు విడుద‌ల చేయ‌డం లేద‌ని ఆయ‌న ప్ర‌శ్నించారు. మ‌రోవైపు సీఎం, సీఎస్, డీజీపీలకు మాత్రం రూ.వందల కోట్లతో ఇళ్లు నిర్మించారని ఆయ‌న అన్నారు.