తెలంగాణాలో కోవిడ్ సహాయక చర్యలకు మద్దతునందిస్తున్న రెన్యూ పవర్
భారతదేశపు ప్రముఖ పునరుత్పాదక సంస్థలలో ఒకటైన రెన్యూ పవర్ ప్రైవేట్ లిమిటెడ్ (రెన్యూ పవర్ లేదా కంపెనీ) తాము కార్యకలాపాలు నిర్వహిస్తోన్న చుట్టు పక్కల ప్రాంతాలలో ఆక్సిజన్ కాన్సన్‌ట్రేటర్లు, పీపీఈ కిట్లు, అంబులెన్స్‌లు మరియు ఆస్పత్రిలలో పడకలను అందిస్తున్నట్లు వెల్లడించింది. మిన్పూర్, డిచ్‌పల్లిలలో ఆక్సిజన్ కాన్సన్‌ట్రేటర్లు, అంబులెన్స్‌లు, ఆస్పత్రి పడకలను దీనిలో భాగంగా అందించడం జరుగుతుంది. తెలంగాణాలోని ఆరు జిల్లాల్లో పీపీఈ కిట్లను సైతం అందించనుంది.
ఈ సేవా కార్యక్రమాలన్నీ కూడా కోవిడ్‌తో జరుగుతున్న పోరాటంలో ప్రభుత్వానికి మద్దతునందించాలనే రెన్యూ పవర్ సీఎస్‌ఆర్ కార్యక్రమంలో భాగం. పలు రాష్ట్ర ప్రభుత్వాలకు అంబులెన్స్‌లు, పీపీఈ కిట్లపంపిణీ, ఫ్రంట్ లైన్ కార్మికుల ప్రయోజనార్థం అదనపు పడకల ఏర్పాటు వంటివి రెన్యూ పవర్ అందించడం ద్వారా తోడ్పడుతుంది. ఇప్పటికే గుజరాత్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, బీహార్, కర్నాటకలలో కంపెనీ తమ వంతు సహకారం అందించింది.
ఈ కార్యక్రమాలను గురించి రెన్యూ పవర్, చైర్ రెన్యూ ఫౌండేషన్ చీఫ్ సస్టెయినబలిటీ ఆఫీసర్ ఎంఎస్ వైశాలి నిగమ్ సిన్హా మాట్లాడుతూ, తెలంగాణా రాష్ట్రంలో అవసరమైన ప్రాంతాలలో స్థానిక అధికారులకు అవసరమైన సామాగ్రిని అందించడం ద్వారా కోవిడ్ సహాయ చర్యలకు మద్దతునందించాలనుకుంటున్నాం. అవసరమైన సామాగ్రి పలు ప్రాంతాలకు చేరుకునేందుకు మేము స్థానిక అధికారులతో కలిసి పనిచేస్తున్నాము. మహమ్మారిని పారద్రోలడంలో రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను బలోపేతం చేయడమే తమ ప్రయత్నం అని అన్నారు.
ఉద్యోగులకు మద్దతునందించే సంస్థగా రెన్యూ పవర్ తమ ఉద్యోగుల కోసం పలు కార్యక్రమాలను ప్రారంభించింది. ఉద్యోగులతో పాటుగా వారికుటుంబ సభ్యులకు టీకాలనందించింది. అలాగే కోవిడ్ వల్ల మరణించిన ఉద్యోగి కుటుంబానికి మొదటి మూడు నెలలు 100% జీతం అందించడంతో పాటుగా ఆ తరువాత రెండేళ్ల పాటు 50% జీతం అందించనున్నట్లు ఇటీవలనే రెన్యూ పవర్ సీఎండీ సుమంత్ సిన్హా ఓ ప్రకటనలో వెల్లడించారు. అంతేకాకుండా చిన్నారుల ట్యూషన్ ఫీజు చెల్లించడంతో పాటుగా వారికి విద్యా సహకారం కూడా అందించనుంది.