మంగళవారం, 7 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఎం
Last Updated : శుక్రవారం, 19 మార్చి 2021 (09:32 IST)

వరంగల్‌లో ఘోర రోడ్డు ప్రమాదం

వరంగల్ జిల్లాలోని ఆత్మకూరు మండలం నీరుకుళ్ల గ్రామం శివారులో శుక్రవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కూలీలతో వెళ్తున్న ఆటోను  తుఫాను వాహనం ఢీకొట్టింది.

ఈ ప్రమాదంలో నలుగురు మహిళా కూలీలు అక్కడికక్కడే మృతి చెందగా, మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రమాదధాటికి శరీర భాగాలు తెగిపడ్డాయి.

ఆటో పూర్తిగా నుజ్జునుజ్జు అయ్యింది. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు.

కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ములుగు నుంచి వరంగల‌ వైపు వస్తున్న తుఫాను వాహనం ఆటోను ఢీకొట్టినట్లు పోలీసులు తెలిపారు.