గురువారం, 19 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 7 నవంబరు 2023 (22:19 IST)

లోన్ యాప్ వేధింపులు: సర్వీస్ గన్‌తో నుదుటిపై కాల్చుకుని..

sabita indra reddy
మంత్రి సబితా ఇంద్రారెడ్డి గన్‌మెన్‌ ఫాజిల్‌ ఆర్సీ తన సర్వీస్‌ వెపన్‌తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. తెలంగాణ పోలీస్‌లో పనిచేస్తున్న ఓఎస్‌ఐ ఆత్మహత్య చేసుకున్నాడు.  
 
వివరాల్లోకి వెళితే.. రాష్ట్ర మంత్రి సబితా ఇంద్రారెడ్డి వద్ద ఫాజిల్ అర్సీ అనే వ్యక్తి గన్‌మెన్ (ఏఎస్‌ఐ)గా పనిచేస్తున్నాడు. అమీర్ పేట శ్రీనగర్ కాలనీలోని ఓ హోటల్‌లో ఆదివారం డ్యూటీకి వచ్చిన ఫాజిల్ ఆర్సీ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. 
 
సర్వీస్ గన్‌తో నుదుటిపై కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. విషయం తెలుసుకున్న మంత్రి సబిత సంఘటనా స్థలానికి చేరుకుని ఆరా తీశారు. ఫాజిల్ ఆర్సీ ఆత్మహత్యపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. 
 
అయితే లోన్ యాప్ వేధింపులే ఇందుకు కారణమని వార్తలు వస్తున్నాయి. తండ్రి ఆత్మహత్య చేసుకున్న సమయంలో కూతురు అక్కడే ఉన్నట్లు తెలుస్తోంది. దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది.