గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : గురువారం, 30 డిశెంబరు 2021 (11:48 IST)

నిజామాబాద్ జిల్లాలో కరెన్సీ నోట్ల కలకలం: విలువ రూ.కోటిపైనే

తెలంగాణ, నిజామాబాద్ జిల్లాలో కరెన్సీ నోట్ల సంచి కలకలం రేపింది. వివరాల్లోకి వెళితే.. నిజామాబాద్‌ జిల్లా మెండోర మండలంలోని బుస్సాపూర్‌ జాతీయ రహదారి పక్కన బుధవారం ఓ నోట్ల సంచి కనిపించింది. మంగళవారం అర్ధరాత్రి సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు వాహనంలో వచ్చి గోనె సంచి మూటను విసరేశారు.
 
బుధవారం అటుగా వెళ్లిన స్థానికులు దానిని తెరిచారు. అందులో భారీ సంఖ్యలో చిరిగిన నోట్లు ఉండడంతో కంగారుపడ్డారు. పోలీసులకు సమాచారం అందించారు. వీటి ధర దాదాపు రూ.కోటిపైనే ఉంటాయని స్థానికులు అంటున్నారు. లారీ నుంచి కింద పడిన సంచి పైనుంచి వాహనాలు వెళ్లడంతో.. కరెన్సీ తుక్కు రోడ్డుపై చెల్లాచెదురుగా పడినట్టు స్థానికులు చెప్తున్నారు.