శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఎంజీ
Last Updated : సోమవారం, 11 అక్టోబరు 2021 (08:29 IST)

ప్రెసిడెంట్‌ అనుమతి లేనిదే మీడియా ముందుకు వెళ్లకూడదు: మోహన్‌బాబు

‘‘అటు పక్కన ఉన్న ఆడపడుచులు, ఇటు పక్కన ఉన్న వారు.. అందరూ ప్రెసిడెంట్‌ అనుమతి లేనిదే మీడియా ముందుకు వెళ్లకూడదు’’ అని మోహన్‌బాబు అన్నారు.

ఎన్నికల అధికారి ఫలితాలను ప్రకటించిన అనంతరం మోహన్‌బాబు స్పందించారు. ‘‘దీనిని ఆనందం అనుకోవడం కరెక్ట్‌ కాదు. ఎందుకంటే ‘భయంకరమైన వాగ్దానాలు చేశారు. నా బిడ్డ అవన్నీ నెరవేర్చుతాడు. జరిగిందేదో జరిగిపోయింది.

అందరం ఒక తల్లి బిడ్డలం అని గుర్తు పెట్టుకోవాలి. ఇది ఏ ఒక్కరి విజయం కాదు. 800లకు పైగా సభ్యుల విజయం. ఎక్కడున్నారో.. నాకు నటుడిగా జన్మనిచ్చిన దాసరి నారాయణరావు ‘మా’ ఎన్నికలు ఏకగ్రీవం కావాలనుకున్నారు. 

ఇకపై మా ఎన్నికలు ఏకగ్రీవంగా జరిగేలా పెద్దలు నిర్ణయం తీసుకోవాలని కోరుకుంటున్నాను. ఇంతటితో విమర్శలకు, వివాదాలకు ఫుల్‌స్టాప్‌ పెట్టండి’’ అని మోహన్‌బాబు అన్నారు.