శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : శనివారం, 15 ఆగస్టు 2020 (09:53 IST)

తెలంగాణలో విజృంభిస్తోన్న కరోనా వైరస్.. 90వేలకు చేరిన కేసులు

తెలంగాణలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. రోజు రోజుకు కరోనా కేసులు పెరుగుతూనే వున్నాయి. రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 90వేలకు చేరింది. గడిచిన 24 గంటల్లో 1863 కరోనా పాజిటివ్ కేసులు నమోదవగా...పది మృతి చెందారు. దీంతో రాష్ట్రంలో మొత్తం మరణాల సంఖ్య 684కి చేరింది. 
 
జీహెచ్‌ఎంసీలో 394, మేడ్చెల్ 174, కరీంనగర్ 104, వరంగల్ అర్బన్101, రంగారెడ్డి 131, సిరిసిల్ల 90, సంగారెడ్డి 81, జగిత్యాల 61, సిద్ధిపేట 60 కేసులు నమోదయ్యాయి. అలాగే 1912 మంది కరోనా నుంచి కోలుకున్నారు.
 
దీంతో ఇప్పటివరకు 66196 మంది కోలుకున్నట్లు వెల్లడించింది. ప్రస్తుతం 023,379 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇప్పటి వరకు నమోదైన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 90,259కు చేరినట్లు వైద్యశాఖ ప్రకటించింది. కరోనా నుంచి కొత్తగా 1912 మంది డిశ్చార్జ్‌ కాగా.. ఇప్పటివరకు 66,196 మంది పూర్తిగా కోలుకున్నారు.