బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 12 జులై 2022 (12:31 IST)

మారేడ్పల్లి సీఐ నాగేశ్వరరావుకు కొత్త చిక్కు..

CI Nageswara Rao
మహిళతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్న ఓ సీఐ బాగోతం బయటపడింది. వనస్థలిపురం లాడ్జిలో మారేడ్పల్లి సీఐ నాగేశ్వరరావు ఓ మహిళతో ఉండగా ఆమె భర్త రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నాడు. 
 
తన భార్యతో ఎఫైర్‌పై ప్రశ్నించినందుకు సీఐ తనపై దాడికి పాల్పడ్డాడని ఆమె భర్త ఆరోపించారు. మహిళ భర్త ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. సీఐపై అత్యాచారం, హత్యాయత్నం కింద కేసు నమోదు చేశారు.  
 
ఈ ఆరోపణల నేపథ్యంలో హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్..సీఐ నాగేశ్వరరావును సస్పెండ్ చేశారు. అత్యాచారం, ఆయుధాల చట్టం కింద నమోదైన కేసులో దర్యాప్తు జరుగుతున్న నేపథ్యంలో సీఐని సస్పెండ్ చేస్తూ సీపీ ఉత్తర్వులు జారీ చేశారు. బక్రీద్, బోనాల పండుగ నేపథ్యంలో కార్ఖానా డీఐ సీ నేతాజీని మారేడ్ పల్లి ఎస్హెచ్వో గా నియమించారు.