గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : గురువారం, 20 జులై 2023 (12:02 IST)

భారీ వర్షాలు.. పాఠశాలలకు రెండు రోజుల పాటు సెలవులు

schools
భారీ వర్షాల కారణంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గురు, శుక్రవారాల్లో అన్ని విద్యాసంస్థలకు రెండు రోజుల సెలవు ప్రకటించింది. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు మార్గదర్శకత్వంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు విద్యాశాఖ మంత్రి పీ సబితా ఇంద్రారెడ్డి గురువారం తన ట్విట్టర్ ద్వారా ప్రకటించారు. 
 
రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల దృష్ట్యా, రాష్ట్రంలోని అన్ని విద్యాసంస్థలకు రెండు రోజుల పాటు సెలవులు ప్రకటించాలని ప్రభుత్వం నిర్ణయించింది. భారీ వర్షాల కారణంగా విద్యార్థులు, అధ్యాపకుల భద్రత కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు విద్యాశాఖ తెలిపింది.