శుభ్‌మన్ గిల్ మా ఇంటి అబ్బాయి.. చాలా ఏళ్లు ఆడాలి: భజ్జీ
టీమిండియా స్టార్ ప్లేయర్ శుభ్‌మన్ గిల్ భారత క్రికెట్ జట్టులో వర్ధమాన స్టార్‌గా వెలుగొందుతున్నాడు. వన్డేలు, టీ-20లు, టెస్టుల అన్ని ఫార్మాట్లలో అదరగొడుతున్నాడు. ఈ ఏడాది ఐపీఎల్‌లో లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా రికార్డును కూడా కలిగి ఉన్నాడు.
పంజాబ్‌కు చెందిన శుభ్‌మన్ గిల్ ప్రస్తుతం మూడు ఫార్మాట్‌లలో భారత్‌కు ఆడుతున్నాడు. ఈ సందర్భంలో, మాజీ ఆటగాడు హర్భజన్ సింగ్ భారత జట్టుకు భవిష్యత్తు అతనేనని జోస్యం చెప్పాడు.
దీని గురించి హర్భజన్ మాట్లాడుతూ.. "గిల్‌కి క్రికెట్ అంటే చాలా ఆసక్తి. ఎప్పుడూ తనను తాను మెరుగుపరుచుకోవడానికి ప్రయత్నించే ఆటగాడు. అతడిని ఇతర ఆటగాళ్లతో పోల్చడం సరికాదు. అతడు భారత జట్టుకు ఎన్నో ఏళ్లు ఆడాలని నా కోరిక. అతను మన రాష్ట్రానికి చెందినవాడు. అతన్ని మా ఇంటి అబ్బాయిగా చూస్తాము". అంటూ కామెంట్స్ చేశాడు.