గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : గురువారం, 20 జులై 2023 (09:12 IST)

తెలంగాణలో భారీ వర్షాలు- పొంగిపొర్లుతున్న వాగులు, వంకలు

Rains
తెలంగాణలో భారీ వర్షాలు కుమ్మేస్తున్నాయి. వాగులు, వంకలు, చెరువులు పొంగిపొర్లుతుండటంతో జలదిగ్భంధనంలో చిక్కుకున్నాయి. రాష్ట్రంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. 
 
హైదరాబాద్‌లో బుధవారం ఎడతెరిపి లేకుండా వర్షం కురిసింది. ఉమ్మడి ఆదిలాబాద్, మెదక్ జిల్లాలో ప్రస్తుతం భారీ వర్షం కురుస్తోంది. అటవీ ప్రాంతాల్లోని వాగుల్లో నీటిమట్టం ప్రమాదకర స్థాయికి చేరుకుంది. 
 
గోదావరి ఎగువ నుంచి నీరు పోటెత్తడంతో భద్రాచలం వద్ద 39 అడుగులకు నీరు చేరింది. మరో నాలుగు అడుగుల మేర నీటి మట్టం పెరిగితే మొదటి ప్రమాద హెచ్చరిక జారీ అవుతుంది.