సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By వరుణ్
Last Updated : మంగళవారం, 10 అక్టోబరు 2023 (09:27 IST)

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై సీ-ఓటర్ ఆసక్తికర సర్వే...

voter id aadhaar
నవంబరు నెలాఖరులో జరిగే తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీ గెలుస్తుందన్న అంశంపై ఏబీపీ - సీ ఓటర్ సర్వే అమితాసక్తికరమైన ఫలితాలను వెల్లడించింది. సీ - ఓటర్ ఒపీనియన్ పోల్స్‌లో వెల్లడైన ఫలితాల మేరకు.. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అత్యధిక స్థానాలు లభించే అవకాశాలు ఉన్నట్టు తెలిపింది. ఈ పార్టీ కనీసం 48 నుంచి 60 స్థానాల్లో గెలుపొందుతుందని తెలిపింది. 
 
అదేసమయంలో అధికార భారత రాష్ట్ర సమితి పార్టీకి 40 నుంచి 55 స్థానాలు రావొచ్చని వెల్లడించింది. ఇక బీజేపీ తెలంగాణ ఎన్నికల్లో మూడో స్థానమే దక్కుతుందని, ఆ పార్టీ మహా అయితే ఐదు నుంచి 10 సీట్లు మాత్రమే వచ్చే అవకాశం ఉందని పేర్కొంది. 
 
అంతేకాదు, ఈసారి ఎన్నికల్లో కాంగ్రెస్ ఓట్ల శాతం 10.5 శాతం పెరిగే అవకాశం ఉందని సీ-ఓటర్ వెల్లడించింది. వచ్చే నెలలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓట్ల శాతం 39 అని, బీఆర్ఎస్ ఓట్ల శాతం 37 అని వివరించింది. 2018 ఎన్నికలతో పోల్చితే బీఆర్ఎస్ ఓట్ల శాతం 9.4 శాతం తగ్గుదల నమోదు కావొచ్చని అభిప్రాయపడింది. బీజేపీ ఓట్ షేర్ కూడా 9.3 శాతం మేర పెరిగే అవకాశాలున్నాయని పేర్కొంది.