ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By వరుణ్

హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో కలకలం : విమానం హైజాక్ అంటూ ఈమెయిల్

samshabad airport
హైదరాబాద్ నగరంలోని శంషాబాద్ విమానాశ్రయంలో కలకలం చెలరేగింది. ఈ ఎయిర్ పోర్టు నుంచి విమానాన్ని హైజాక్ చేసినట్టు ఆకాశరామన్న ఈ మెయిల్‌లో బెదిరించాడు. దీంతో దుబాయ్ వెళ్లే విమాన సర్వీసును రద్దు చేసి, ఆ విమాన ప్రయాణికులను హోటల్‌కు తరలించారు. ఈ బెదిరింపు ఈమెయిల్‌కు సంబంధించి ఓ అనుమానితుడిని అదుపులోకి తీసుకున్నారు. 
 
సోమవారం ఉదయం శంషాబాద్ ఎయిర్ పోర్టుకు ఓ ఈమెయిల్ బెదిరింపు వచ్చింది. విమానం హైజాక్ చేస్తామని ఆ ఈమెయిల్ సారాంశం. వెంటనే అప్రమత్తమైన ఎయిర్ పోర్టు అధికారులు.. విమానాశ్రయం వ్యాప్తంగా హైఅలెర్ట్ ప్రకటించి, భద్రతను కట్టుదిట్టం చేసారు. ఈ క్రమంలో దుబాయ్‌ వెళ్లే ఓ విమానానని తనిఖీ చేశారు. 
 
అనంతరం ఆ విమాన సర్వీసును రద్దు చేసి ప్రయాణికులను హోటల్‌కు తరలించారు. మరోవైపు, ఈ బెదిరింపు మెయిల్ ఎవరు పంపించారనే కోణంలో అధికారులు ఆరా తీస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి ఇప్పటికే ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.