మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By
Last Updated : శుక్రవారం, 16 నవంబరు 2018 (13:26 IST)

పొన్నాలకు టిక్కెట్ ఇవ్వాలని కోదండరాంను కోరిన కాంగ్రెస్ నేత పొంగులేటి

పొన్నాల లక్ష్మయ్య. తెలంగాణ ప్రాంతానికి చెందిన కాంగ్రెస్ సీనియర్ నేత, పీసీసీ మాజీ అధ్యక్షుడు. అలాంటి పొన్నాలకు కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఝులక్ ఇచ్చారు. తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం కల్పించలేదు. అంటే ఆయనకు టిక్కెట్ ఇవ్వలేదు. అలాగే, మరో సీనియర్ నేత పొంగులేటి సుధాకర్ రెడ్డికి కూడా టిక్కెట్ ఇవ్వలేదు. 
 
తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల కోసం కాంగ్రెస్ - తెలుగుదేశం పార్టీ సారథ్యంలో మహా కూటమి ఏర్పాటైంది. ఈ కూటమి పొత్తుల్లో భాగంగా జనగామ (పొన్నాల స్థానం), ఖమ్మం (పొంగులేటి సీటు) స్థానాలకు మిత్రులకు కేటాయించారు. దీంతో వీరిద్దరికీ సీట్లు ఇవ్వలేమని రాహుల్ గాంధీ తేల్చి చెప్పి.. మరో మార్గంలో న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. దీంతో పొన్నాల, పొంగులేటి ఆశలపై నీళ్లు చల్లినట్టయింది. 
 
అయితే, జనగామ టిక్కెట్ విషయమై తెలంగాణ జన సమితి అధినేత ప్రొఫెసర్ కోదండరాంతో పొంగులేటి సుధాకర్ రెడ్డి ఫోనులో మాట్లాడారు. ఇప్పటికే బీసీల్లో వ్యతిరేకత ఉందని, పీసీసీ అధ్యక్షుడుగా పని చేసిన వ్యక్తికి టిక్కెట్ ఇవ్వలేదంటే బాగుండదని, అందువల్ల పొన్నాల పరిస్థితిని పరిగణనలోకి తీసుకుని కోరారు. 
 
అంటే జనగామ టిక్కెట్‌ను పొన్నాలకు కేటాయించాలని కోదండరాంను పొంగులేటి సుధాకర్ రెడ్డి కోరారు. దీనిపై స్పందించిన పొంగులేటి.. పరస్పరం మాట్లాడుకుంటే సమస్య పరిష్కారమవుతుందని, తాను కూడా ఢిల్లీకి వస్తున్నానని, అక్కడ రాహుల్‌తో భేటీ తర్వాత సమస్యను సామరస్యపూర్వకంగా పరిష్కరించుకుందామని చెప్పారు.