గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 28 ఏప్రియల్ 2021 (12:10 IST)

కమ్మేసిన కరోనా మహమ్మారి : ఉద్యోగం రాదని నిరుద్యోగి సూసైడ్

తెలంగాణా రాష్ట్రంలో మరో నిరుద్యోగి ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రపంచాన్ని కరోనా వైరస్ కమ్మేసిందనీ, ఇకపై ఉద్యోగం రాదని ఆందోళనకుగురై బలవన్మరణానికి పాల్పడ్డాడు. 
 
ముఖ్యంగా, తెలంగాణ రాష్ట్రంలో వివిధ ప్రభుత్వ శాఖల్లో ఉన్న ఖాళీ పోస్టుల భర్తీకి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదనే ఆరోపణలు చేస్తున్నారు. ఈ క్రమంలో ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల కావడం లేదని, ఇక వచ్చే అవకాశం లేదని ఇప్పటికే వరంగల్‌కు చెందిన ఒక నిరుద్యోగి ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. 
 
తాజాగా నల్లగొండ జిల్లా చండూరు మండలం పుల్లెంలలో మరో నిరుద్యోగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ప్రభుత్వం నుంచి ఎలాంటి ఉద్యోగ నోటిఫికేషన్లు వెలువడకపోవడంతో మనస్తాపానికి గురైన పాక శ్రీకాంత్ (25) అనే నిరుద్యోగి పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.