Daily Horoscope
✕

చోరీ కేసులో జైలుకెళ్లింది.. తిరిగొచ్చి పెళ్లాడమంది... ముఖం చాటేయడంతో...

Written By ఠాగూర్
Updated: బుధవారం, 10 మార్చి 2021 (10:53 IST)
తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఓ యువతి తనకు జరిగిన అన్యాయంపై పోలీసులను ఆశ్రయించింది. తనను ప్రేమించి గర్భవతిని చేసి ఇప్పుడు పెళ్లి చేసుకోమంటే ముఖం చాటేస్తున్నాడని పోలీసులకు ఫిర్యాదు చేసింది. 
 
మీర్‌పేట ఇన్‌స్పెక్టర్‌ మహేందర్‌రెడ్డి కథనం ప్రకారం, వికారాబాద్‌కు చెందిన యువతి(21) జిల్లెలగూడ లలితానగర్‌లో నివాసం ఉంటూ ఓ ప్రైవేటు ఆసుపత్రిలో నర్సుగా పనిచేసింది. దేవరకొండకు చెందిన విజయ్‌కుమార్‌(25)తో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. కొన్ని రోజుల పాటు వారిద్దరూ ఒకే చోట కలిసి ఉన్నారు. 
 
గత నెల 14న లలితానగర్‌లోని వృద్ధ దంపతులకు ఈ యువతి కరోనా టీకా పేరుతో మత్తుమందు ఇచ్చి వారి నగలు తస్కరించింది. ఈ కేసులో పోలీసులు ఆమెను జైలుకు పంపించారు. ఇటీవల బయటకు వచ్చిన తర్వాత ఆమె విజయ్‌కుమార్‌ను కలిసి పెళ్లి చేసుకోవాలని కోరగా నిరాకరించాడు. 
 
తనను కలువకపోగా, ఫోన్‌ చేసినా స్పందించడం లేదని బాధితురాలు పేర్కొంది. గతంలో అతనితో దిగిన ఫొటోలను పోలీసులకు అందజేసింది. ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్‌స్పెక్టర్‌ తెలిపారు. 

అన్నీ చూడండి

Dada song: నర్గీస్ ఫక్రీ, బాలకృష్ణ లపై దాదా ధమాకా:ఫస్ట్ సింగిల్‌

Nithin: నితిన్ చిత్రం అలియాస్ రుక్మిణి నుంచి పిచ్చి ప్రేమలో పాట రిలీజ్

Dil Raju Launch: జయంత్ అండ్ ది జింగో పెన్ నుంచి నా కనుపాపే.. సాంగ్

G.V. Prakash Kumar :ఆకాశంలో ఒక తార చిత్రానికి నేషనల్ అవార్డ్స్ వస్తుందని నమ్ముతున్నా : జీవీ ప్రకాశ్ కుమార్

సీఐఐ భాగస్వామ్య సదస్సులో 36.24 కోట్ల ఎంవోయూ కుదుర్చుకున్న నమస్తే వరల్డ్

తర్వాతి కథనం
Show comments