1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : బుధవారం, 10 మార్చి 2021 (10:04 IST)

తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు.. మార్చి 15నుంచి ప్రారంభం

తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ, శాసనమండలి బడ్జెట్ సమావేశాలు మార్చి15 నుంచి ప్రారంభం కానున్నాయి. అసెంబ్లీ పదిహేనో సమావేశాల నోటిఫికేషన్‌ను శాసనసభ కార్యదర్శి వి.నర్సింహాచార్యులు మంగళవారం విడుదల చేశారు. 15న ఉదయం 11 గంటలకు గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ ఇరు సభలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఇటీవల మరణించిన టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య, మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు 16న సంతాపం ప్రకటిస్తారు.
 
17న గవర్నర్‌ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ఉభయ సభలు కేసీఆర్‌ ప్రభుత్వం ఇప్పటికే సన్నాహాలు ప్రారంభించింది. 2021-22 బడ్జెట్‌కు సంబంధించి అన్ని ఏర్పాట్లు చేసింది. వేర్వేరుగా సమావేశమవుతాయి.
 
కేసీఆర్‌ ప్రభుత్వం ఇప్పటికే బడ్జెట్ సన్నాహాలు ప్రారంభించింది. 2021-22 బడ్జెట్‌కు సంబంధించి అన్ని ఏర్పాట్లు చేసింది. 18న ఉదయం 11.30కు తెలంగాణ 2021–22 వార్షిక బడ్జెట్‌ను ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు అసెంబ్లీలో ప్రవేశపెట్టే అవకాశముంది. 
 
అయితే బడ్జెట్‌ను ప్రవేశపెట్టే తేదీ, సమయంతోపాటు ఉభయ సభలను ఎన్నిరోజుల పాటు నిర్వహించాలనే దానిపై ఈ నెల 16న జరిగే బిజినెస్‌ అడ్వైజరీ కమిటీ సమావేశంలో నిర్ణయించే అవకాశం ఉంది. ప్రస్తుతం రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది.