మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By pnr
Last Updated : శుక్రవారం, 19 జనవరి 2018 (08:59 IST)

టీడీపీని తెరాసలో విలీనం చేద్ధాం : మోత్కుపల్లి నర్సింహులు

తెలంగాణ ప్రాంతానికి టీడీపీ సీనియర్ నేత మోత్కుపల్లి నర్సింహులు సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణాలోని టీడీపీని అధికార తెరాస పార్టీలో విలీనం చేద్దామని సలహా ఇచ్చారు.

తెలంగాణ ప్రాంతానికి టీడీపీ సీనియర్ నేత మోత్కుపల్లి నర్సింహులు సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణాలోని టీడీపీని అధికార తెరాస పార్టీలో విలీనం చేద్దామని సలహా ఇచ్చారు. తెలంగాణ రాష్ట్రంలో టీడీపీ అంతరించి పోతోందని అని చెప్పుకోవడం కంటే అధికార తెరాసలో కలిపేస్తే మంచిదన్నారు. తెరాసలో విలీనం చేస్తే ఎన్టీఆర్‌ ఆత్మ కూడా శాంతిస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. 
 
టీడీపీ వ్యవస్థాపకుడు, ఎన్టీ రామారావు వర్ధంతి వేడుకలు గురువారం జరిగాయి. ఈ సందర్భంగా మోత్కుపల్లి ఎన్టీఆర్‌ ఘాట్‌కు వచ్చి నివాళులర్పించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ, 'చంద్రబాబుకు ఎన్ని పనులున్నా.. ఎన్టీఆర్‌ ఘాట్‌కు వచ్చి నివాళులర్పిస్తే బాగుండేదన్నారు. తెలంగాణలో టీడీపీ పరిస్థితి ఇబ్బందికరంగా ఉందనీ, పార్టీ ప్రాభవం కోల్పోతోందని అందరూ అంటుంటే మానసికక్షోభ కలుగుతోందన్నారు. 
 
భుజాన వేసుకుందామనుకున్నా సహకరించేవారు లేరని ఆవేదన వ్యక్తం చేశారు. కేసీఆర్‌ మన దగ్గర్నుంచి వెళ్లిన నాయకుడే. చాలా మంది మంత్రులూ టీడీపీ నుంచి వెళ్లినవారే. ఈ పరిస్థితుల్లో పార్టీని తెరాసలో విలీనం చేస్తే ఎన్టీఆర్‌ ఆత్మకు శాంతి కలుగుతుందన్నారు. పార్టీ అంతరించిపోయిందనే అవమానం కంటే ఒక మిత్రుడికి సాయం చేయడమే గౌరవంగా ఉంటుంది. చంద్రబాబుకు వ్యక్తిగతంగా సలహా ఇస్తున్నా. ఆయన అర్థం చేసుకోవాలని కోరుతున్నా' అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.