బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By శ్రీ
Last Modified: గురువారం, 24 సెప్టెంబరు 2020 (20:32 IST)

తాగుబోతు కొడుకు, సుపారీ ఇచ్చి హత్య చేయించిన తల్లి

తాగుబోతు కొడుకుని వదిలించుకోవడం కోసం ఓ తల్లి కిరాయి హత్య చేయించింది. 50 వేల రూపాయల సుపారీ ఇచ్చి ఈ దారుణానికి ఒడిగట్టింది. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం మంచిర్యాల జిల్లా నెన్నెల మండలం అవడం గ్రామానికి చెందిన బొమ్మని లక్ష్మి నజీర్ పల్లిలో నివాసం ఉండేది. లక్ష్మి భర్త సింగరేణిలో ఉద్యోగం చేస్తూ అకస్మాత్తుగా చనిపోవడంతో ఈ ఊరికి వలసవచ్చింది.
 
కొడుకు కిషోర్ 2018లో నజీర్ పల్లి గ్రామానికి చెందిన ముష్క సమ్మయ్య కూతురును ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. కిషోర్ మద్యానికి బానిసై తను చేసే డ్రైవింగ్ పని కూడా సరిగా చేయకుండా ఇంట్లో ఉన్న వస్తువులు అమ్ముకుంటూ తాగడానికి నిత్యం తల్లిని వేధిస్తూ ఉండేవాడు. భూములు అమ్మి తనకు డబ్బులు ఇవ్వమని తల్లిని కొడుతూ ఉండేవాడన్నారు.
 
ఈ క్రమంలో తల్లి బొమ్మ లక్ష్మిని కొడుకు తాగి వచ్చి డబ్బుల కోసం వేధించడం కొట్టడం భరించలేక కిషోర్‌ను ఏ  విధంగానైనా చంపేయాలని డిసైడ్ అయింది. దగ్గరి బంధువైన మంచిర్యాలకు చెందిన సంతోషం రఘువరన్‌తో కలిసి చంపాలి అని నిర్ణయించుకొన్నారు. కిషోర్‌ను చంపడానికి మృతుని తల్లి వద్ద రఘువరన్ రూ. 50 వేల రూపాయలు సుపారి కుదుర్చుకుని 10 వేల రూపాయలు ముందుగా తీసుకున్నాడు.
 
రఘువరన్ 15వ తేదీ కిషోర్ గ్రామానికి వెళ్లి అక్కడ కిషోర్‌ని కారులో ఎక్కించుకుని 18 తేదీన చిన్న వైర్ సహాయంతో గొంతుకు బిగించి చంపేసాడు. ఆ తర్వాత నజీర్ పల్లి ప్లైఓవర్ వద్ద పడేసాడు. దీనిపై విచారణ చేపట్టిన పోలీసులు మృతుడి తల్లిని, కిరాయి హంతకుడు రఘుని అరెస్ట్ చేసారు.