గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By వరుణ్
Last Updated : ఆదివారం, 2 ఏప్రియల్ 2023 (18:00 IST)

తెలంగాణ విద్యార్థులకు 77 రోజుల సెలవులు

ts inter board
తెలంగాణ రాష్ట్రానికి చెందిన విద్యార్థులకు 77 రోజుల సెలవులు ఇవ్వనున్నట్టు ఆ రాష్ట్ర ఇంటర్మీడియట్ బోర్డు వెల్లడించింది. 2023-24 విద్యా సంవత్సరంలో ఈ సెలవులు ఇస్తామని తెలిపింది. ఈ విద్యా సంవత్సరంలో 365 రోజులకు గాను 227 రోజులపాటు తరగతులు ఉంటాయని వివరించింది. జూన్ ఒకటో తేదీ నుంచి కొత్త విద్యా సంవత్సరంలో తరగతులు ప్రారంభమవుతాయని తెలిపారు.
 
పండగులు, ఆదివారాలు, రెండో శనివారాలు, వేసవి సెలవులు ఇలా అన్ని మొత్తంగా కలిపి 77 రోజులపాటు సెలవులు ఉంటాయని పేర్కొంది. ఈ సెలవుల్లో అక్టోబరు 19 నుంచి 25వ తేదీ వరకు దసరా సెలవులు, జనవరి 13 నుంచి 16 వరకు సంక్రాంతి సెలవులు ఉంటాయి. ఇక ఫిబ్రవరి 2న వారంలో ప్రాక్టికల్స్, మార్చి మొదటివారంలో వార్షిక పరీక్షలు ఉంటాయని ఇంటర్ బోర్డు తెలిపింది.