శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By pnr
Last Updated : మంగళవారం, 15 ఆగస్టు 2017 (13:52 IST)

తెలంగాణలో కొలువుల జాతర... టీఎస్‌పీఎస్సీ చైర్మన్ ఘంటా చక్రపాణి

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొలువుల జాతర ప్రారంభంకానుంది. ఇందులోభాగంగా, త్వరలోనే ఉద్యోగాల భర్తీ నిరంతర ప్రక్రియగా కొనసాగుతుందని టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్ ఘంటా చక్రపాణి తెలిపారు.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొలువుల జాతర ప్రారంభంకానుంది. ఇందులోభాగంగా, త్వరలోనే ఉద్యోగాల భర్తీ నిరంతర ప్రక్రియగా కొనసాగుతుందని టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్ ఘంటా చక్రపాణి తెలిపారు. ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ తెలంగాణలో భవిష్యత్‌లో ఉద్యోగాలకు కొదువలేదన్నారు. త్వరలో 2,500 ఇంజినీర్ పోస్టులను భర్తీ చేస్తామన్నారు. 
 
కాగా, ఇప్పటివరకు టీఎస్‌పీఎస్సీ ఆధ్వర్యంలో 26 నోటిఫికేషన్ల ద్వారా ఉద్యోగాలను భర్తీ చేశామని తెలిపారు. డీఎస్సీ నిర్వహణపై ఒకటి, రెండు రోజుల్లో స్పష్టత వస్తుందన్నారు. డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేస్తే 8 వేల పోస్టులు భర్తీ చేసే అవకాశం ఉన్నదని చెప్పారు. గ్రూపు-2 ఉద్యోగాల నియామక అంశం కోర్టు పరిధిలో ఉన్నదన్నారు.
 
రెండు, మూడు రోజుల్లో అటవీశాఖలో రెండు వేల ఉద్యోగాల భర్తీకి సంబంధించి నోటిఫికేషన్ జారీ చేస్తామన్నారు. ఇందులో 1,800 బీట్ ఆఫీసర్ల్లు, 200 రేంజ్ ఆఫీసర్ల పోస్టులున్నాయని తెలిపారు. ఇంటర్ ఉత్తీర్ణత సాధించిన వారికి బీట్ ఆఫీసర్ ఉద్యోగ నియామకాలు చక్కటి అవకాశమన్నారు. వైద్య ఆరోగ్యశాఖలోనూ 400 డాక్టర్ల పోస్టులను భర్తీ చేస్తామని తెలిపారు. గురుకుల పాఠశాలల్లో 15వేల ఉద్యోగాల నియామకాలను ఈ ఏడాది డిసెంబర్ నాటికి పూర్తి చేస్తామన్నారు.