శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : శనివారం, 23 జులై 2022 (12:48 IST)

వరంగల్‌లో కూలిన భవనాలు.. ఇద్దరు మృతి

తెలంగాణపై వరుణుడు మళ్లీ తన ప్రతాపం చూపుతున్నాడు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్‌ సహా.. జిల్లాల్లో భారీ వానలు పడ్డాయి.
 
దీంతో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది వాతావరణశాఖ. నాలుగు జిల్లాలకు రెడ్‌ అలర్ట్‌ జారీ చేసింది. ఆరు జిల్లాలకు ఆరెంజ్‌ అలర్ట్‌, మరో 13 జిల్లాలకు ఎల్లో అలర్ట్‌ జారీ అయ్యింది.
 
ఈ నేపథ్యంలో వరంగల్‌ మండిబజార్‌లో రెండు పురాతన భవనాలు కూలిపోయాయి. భారీ వర్షాలకు మండిబజార్‌లోఈ భవనాల కూలిన ఘటనలో ఇద్దరు మృతి చనిపోగా.. ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. 
 
ఒక్కసారిగా రెండు బిల్డింగులు కూలిపోవడంతో 60ఏళ్ల పైడిన వ్యక్తి, 20ఏళ్ల ఫిరోజ్‌ స్పాట్‌లోనే చనిపోయారు. ఇక గాయపడ్డ మహిళ సమ్మక్క పరిస్థితి విషమంగా ఉంది. ఆమెను ఎంజీఎం ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.