ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 1 మార్చి 2022 (17:45 IST)

పేద విద్యార్థుల ఉపకారవేతనాలపై సీఎం కేసీఆర్‌కు లేఖ

పేద విద్యార్థుల ఉపకార వేతనాల అంశంపై తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కేంద్ర మంత్రి, సికింద్రాబాద్ ఎంపీ కిషన్ రెడ్డి ఓ లేఖ రాశారు. రాష్ట్రంలోని పేద విద్యార్థులకు లబ్ధిని చేకూర్చే పోస్ట్ మెట్రిక్ ఎస్సీ, ఎస్టీ స్కాలర్‌షిప్‌ల అమలుపై ప్రత్యేక దృష్టిసారించాలని ఆయన తన లేఖలో కోరారు. 
 
గత విద్యా సంవత్సరం కేంద్రంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం వాటా నిధులు కలిపి విడుదల చేయాల్సిన ఉపకారవేతనాలను వెంటే విడుదల చేయడంతో పాటు ఈ విద్యా సంవత్సరానికి సంబంధించిన స్కాలర్‌షిప్‌లకోసం దరఖాస్తు చేసుకున్న విద్యార్థుల వివరాలను తక్షణమే ధృవీకరించిన పోర్టల్‌లో అప్‌లోడ్ చేయాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కోరారు.