బుధవారం, 27 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By srinivas
Last Modified: మంగళవారం, 3 జులై 2018 (13:52 IST)

కేటిఆర్‌కి దిమ్మతిరిగేలా కౌంట‌ర్ ఇచ్చిన ఉత్త‌మ్..!

టి.ఆర్.ఎస్ నాయ‌కుడు కేటిఆర్ - కాంగ్రెస్ నాయ‌కుడు ఉత్త‌మ్ కుమార్ మ‌ధ్య ట్విట్ట‌ర్ సాక్షిగా మాట‌ల యుద్ధం జ‌రుగుతోంది. ఇంత‌కీ ఏం జ‌రిగిందంటే... తెలంగాణ రాష్ట్రాన్ని అమ్మో, బొమ్మో ఇవ్వలేదని, ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఉద్యమం ద్వారా పోరాడి తెలంగాణ తెచ్చుకున్నార

టి.ఆర్.ఎస్ నాయ‌కుడు కేటిఆర్ - కాంగ్రెస్ నాయ‌కుడు ఉత్త‌మ్ కుమార్ మ‌ధ్య ట్విట్ట‌ర్ సాక్షిగా మాట‌ల యుద్ధం జ‌రుగుతోంది. ఇంత‌కీ ఏం జ‌రిగిందంటే... తెలంగాణ రాష్ట్రాన్ని అమ్మో, బొమ్మో ఇవ్వలేదని, ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఉద్యమం ద్వారా పోరాడి తెలంగాణ తెచ్చుకున్నారని ఐటీ మంత్రి కేటీఆర్‌ చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపుతున్నాయి. సోనియాగాంధీని ఉద్దేశించి కేటీఆర్‌ తీవ్ర వ్యాఖ్యలు చేశారని, ఆయనను కేసీఆర్‌ కంట్రోల్‌లో పెట్టాలని కాంగ్రెస్‌ నేతలు ఫైర్‌ అయ్యారు. 
 
ఈ నేపథ్యంలో కేటీఆర్‌ స్పందిస్తూ.. ఉత్తమ్‌గారూ.. నా వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నాను. 1952 నుంచి 2014 వరకు కాంగ్రెస్‌ పార్టీ చరిత్ర అంతా తెలంగాణకు మోసాలు, ద్రోహలతో నిండి ఉంది. ప్రజా ఉద్యమానికి తలొగ్గి అనివార్య పరిస్థితుల్లోనే రాష్ట్రాన్ని ఇచ్చారని ట్వీట్‌ చేశారు. ఈ ట్వీట్‌పై ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి కౌంటర్‌ ఇచ్చారు. అది కూడా మామూలుగా ఇవ్వ‌లేదు. కేటిఆర్‌కి దిమ్మ‌తిరిగేలా కౌంట‌ర్ ఇచ్చారు. 
 
ఉత్త‌మ్ ఏమ‌న్నారంటే... ‘సోనియాగాంధీ దయ వల్లనే తెలంగాణ వచ్చింది. ఇది ఎవరన్నా కాదంటే.. వారు మూర్ఖులే.. సోనియా వల్లే తెలంగాణ వచ్చింది. ఇందులో ఎవరికీ అనుమానాలు అవసరం లేదు’ అంటూ సీఎం కేసీఆర్‌ అసెంబ్లీలో పేర్కొన్న వీడియో లింక్‌ను ట్యాగ్‌ చేస్తూ.. మీ నాన్న వ్యాఖ్యలతో విభేదిస్తున్నారా? అని ఉత్తమ్‌ ప్రశ్నించారు. మ‌రి... దీనిపై కేటీఆర్‌ ఎలా స్పందిస్తారో అనేది ఆస‌క్తిగా మారింది.