శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఐవీఆర్
Last Modified: మంగళవారం, 4 ఫిబ్రవరి 2020 (14:21 IST)

వైష్ణవి ఆసుపత్రి మేనేజింగ్ డైరెక్టర్ అజయ్ ఆత్మహత్య

తెలంగాణ రాజధాని హైదరాబాదులోని వైష్ణవి ఆసుపత్రి మేనేజింగ్ డైరెక్టర్ అజయ్ ఆత్మహత్య చేసుకున్నాడు. అతడు తన ఆసుపత్రిలోనే ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడటంతో కలకలం రేగింది. అతడు ఆత్మహత్యకు గల కారణాలను కూడా తన డైరీలో రాశాడు. ఆ డైరీలో నలుగురు పేర్లను రాసి వారు తనను మానసికంగా వేధించడం వల్లనే సూసైడ్ చేసుకుంటున్నట్లు అందులో రాశాడు. 
 
ఐతే రాసింది అతడేనా లేదంటే ఎవరైనా హత్య చేసి ఇలా ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారా అనే అనుమానాలు కూడా వస్తున్నాయి. కాగా డైరీలో యాంజల్‌కి చెందిన కొత్తకురుమ్మ శివకుమార్, కరుణారెడ్డి, కొండల్ రెడ్డి, మేఘారెడ్డి పేర్లను పేర్కొన్నాడు. కాగా మృతుడు ఎలా చనిపోయాడన్నది పోస్టుమార్టం రిపోర్టు వస్తే కానీ తెలియదు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.