గురువారం, 9 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : బుధవారం, 24 ఫిబ్రవరి 2021 (12:12 IST)

వామన్ రావు కేసు.. నిందితుడు హత్య చేసి కారులోనే హాయిగా నిద్రించాడా?

పెద్దపల్లి జిల్లా మంథని కోర్టు వద్ద ఇవాళ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. హైకోర్టు అడ్వకేట్ దంపతులు వామన రావు, పి.వి. నాగమణిల హత్య కేసులో అరెస్ట్ అయిన బిట్టు శ్రీనును మంథని పోలీసులు ఇవాళ కోర్టు ఎదుట హాజరుపరిచారు. బిట్టు శ్రీనును కోర్టులో హాజరు పరుస్తున్నారనే సమాచారంతో అక్కడకు భారీ సంఖ్యలో చేరుకున్న లాయర్లు.. బిట్టు శ్రీనుకు వ్యతిరేకంగా నినాదాలు చేసి తమ నిరసన తెలిపారు. వామనరావు, నాగమణి దంపతులను హత్య చేయించిన బిట్టు శ్రీనుకు కఠిన శిక్ష పడాలని లాయర్లు నినాదాలు చేశారు. 
 
తెలంగాణలో సంచలనం సృష్టించి న్యాయవాది వామన్ రావు దంపతుల హత్య కేసును హైకోర్టు సుమోటోగా స్వీకరించింది. దీనిపై నిందితులను కఠినంగా శిక్షించాలని పేర్కొంది. అంతేకాకుండా సమగ్ర దర్యాప్తు జరపాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. సంబంధించి పూర్తి నివేదికను మార్చి 1లోగా సమర్పించా లని రాష్ట్ర డీజీపీకి ఆదేశాలు జారీ చేసింది. నిర్దిష్ట కాలపరిమితిలో విచారణ పూర్తిచేయాలని ఆదేశాలు జారీ చేసింది. 
 
మరోవైపు వామన రావు దంపతుల హత్య కేసును సీబీఐకి అప్పగించాలంటూ ఐ కె ఎన్ రావు పిటిషన్ దాఖలు చేశారు దీనిని తాము సుమోటోగా పరిగణిస్తామని హైకోర్టు తెలిపింది. వెంటనే విచారణ చేపట్టి పూర్తి ఆదేశాలను కూడా జారీ చేసింది.
 
ఇకపోతే.. ఇంకా ఈ కేసులో షాకింగ్ నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. హత్య జరిగిన సమయంలో రెండు ఆర్టీసీ బస్సులు అక్కడ ఉన్నట్లు కోర్టు వీడియో ద్వారా గుర్తించిందన్నారు. ఆర్టీసీ బస్సులో ఉన్న ప్రయాణికుల్ని కూడా సాక్షులుగా తీసుకోవాలని ఆదేశించింది. వామన్ రావు అపఖ్యాతి పాలైన నేరస్థుడు అని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. 
 
అతనిపై మొత్తం 20 కేసులు నమోదయ్యాయని, మూడు కేసులలో అతన్ని అరెస్టు చేశారని తెలుస్తోంది. తన శిక్షపై సుప్రీంకోర్టుకు అప్పీల్ చేసినప్పటికీ, అతని శిక్షను సుప్రీంకోర్టు సమర్థించింది. వామన్ రావుకు క్రిమినల్ చరిత్ర వుందని తెలుస్తోంది. అలాగే వామన్ హత్య కేసులో నిందితుడైన వ్యక్తి న్యాయవాదుల దంపతులను హత్య కేసు కారులోనే నిద్రించాడని తెలుస్తోంది.