శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 31 మే 2022 (20:00 IST)

ఐర్లాండ్ దీవుల్లో విహారయాత్రకు వెళ్లి తెలంగాణ యువకుడు మృతి

youth dies
ఫ్లోరిడాకు సమీపంలోని ఐర్లాండ్ దీవుల్లో విహారయాత్రకు వెళ్లిన తెలంగాణ యువకుడు దుర్మరణం పాలయ్యాడు. ఈ వార్త తెలిసిన ఆయన కుటుంబ సభ్యులు బోరున విలపిస్తున్నారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, తెలంగాణ రాష్ట్రంలోని వేములవాడకు చెందిన కంటె మల్లయ్య కుమారుడు కంటె యశ్వంత్ (25) అనే యువకుడు ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లాడు. 
 
అయితే, ఆయన తన స్నేహితులతో కలిసి ఫ్లోరిడాకు సమీపంలోని ఐర్లాండ్ దీవులకు వివారయాత్రకు వెళ్లాడు. అక్కడ నుంచి ఓ ప్రైవేటు బోటు తీసుకుని పీటా దీవులకు వద్దకు చేరుకున్నాడు. అక్కడ సముద్ర స్నానం చేస్తుండగా ఒక్కసారిగా రాక్షస అలల తాకిడి గురై సముద్రంలోకి కొట్టుకునిపోయాడు. ఈ విషయాన్ని వేములవాడలోని కుటుంబ సభ్యులకు యశ్వంత్ స్నేహితులు చేరవేయడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు.