బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By pnr
Last Updated : సోమవారం, 22 జనవరి 2018 (09:33 IST)

ప్రేమలో పడిన కలెక్టర్ ... 18న జూనియర్ ఐపీఎస్‌తో పెళ్లి

వరంగల్ అర్బన్ జిల్లా కలెక్టర్‌గా ఉన్న అమ్రపాలి ప్రేమలో పడ్డారు. తనకంటే చిన్నవాడైన ఐపీఎస్ అధికారిని వివాహం చేసుకోనున్నారు. వీరి ప్రేమ వివాహం వచ్చే నెల 18వ తేదీన ఢిల్లీలో జరగనుంది. 2011 బ్యాచ్‌కి చెందిన

వరంగల్ అర్బన్ జిల్లా కలెక్టర్‌గా ఉన్న అమ్రపాలి ప్రేమలో పడ్డారు. తనకంటే చిన్నవాడైన ఐపీఎస్ అధికారిని వివాహం చేసుకోనున్నారు. వీరి ప్రేమ వివాహం వచ్చే నెల 18వ తేదీన ఢిల్లీలో జరగనుంది. 2011 బ్యాచ్‌కి చెందిన సమీర్ శర్మ అనే ఐపీఎస్ అధికారిని ఆమె ప్రేమ వివాహం చేసుకోనున్నారు. 
 
2010లోనే ఐపీఎస్‌కు ఎంపికైన అమ్రపాలి, తన కన్నా ఓ సంవత్సరం జూనియర్ అయిన శర్మకు మనసిచ్చారు. ఉత్తరాదికి చెందిన సమీర్, ప్రస్తుతం కేంద్ర పాలిత ప్రాంతమైన డయ్యూలో ఎస్పీగా పని చేస్తున్నారు. ఆయనతో గత కొంతకాలంగా ప్రేమలో ఉన్న అమ్రపాలి, విషయం పెద్దలకు చెప్పి, వారిని కూడా పెళ్లికి ఒప్పించారు. 
 
కాగా, అమ్రపాలి తండ్రి కాట వెంకటరెడ్డి, ఆంధ్రా యూనివర్శిటీలో ప్రొఫెసర్‌గా పనిచేశారు. మద్రాస్ ఐఐటీ నుంచి సివిల్ ఇంజనీరింగ్లో బీటెక్ పూర్తి చేశారు. అనంతరం బెంగళూరు ఐఐఎం నుంచి పీజీ డిప్లొమా పట్టా అందుకున్నారు. ఐఏఎస్‌ కాకముందు జూనియర్ రిలేషన్‌షిప్ బ్యాంకర్‌గా పని చేశారు. 2010లో సివిల్స్‌ రాసి 39వ ర్యాంక్ సాధించారు. మంచి ర్యాంక్ రావడంతో సొంత రాష్ట్ర కేడర్‌లో ఐఏఎస్‌గా ఎంపికయ్యారు.
 
2014లో వికారాబాద్ సబ్ కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టిన ఆమ్రపాలి అనంతరం మహిళా శిశు సంక్షేమ విభాగానికి మారారు. 2016లో కేసీఆర్ ప్రభుత్వం ఆమెను వరంగల్ అర్బన్ కలెక్టర్‌గా నియమించింది. యంగ్ అండ్ డైనమిక్ కలెక్టర్ అయిన ఆమ్రపాలి టెక్నాలజీ వాడకంలో ముందంజలో ఉన్నారు. 
 
సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ.. యువతకు దగ్గరయ్యారు. చక్కటి పనితీరుతో తెలంగాణ వ్యాప్తంగా తనకంటూ గుర్తింపు తెచ్చుకున్నారు. సంప్రదాయ కలెక్టర్‌ హంగు ఆర్భాటాలకు దూరంగా ఉంటూ.. ప్రజలతో మమేకయ్యే ఈ యువ ఐఏఎస్ తెలుగు రాష్ట్రాల యువతకు స్ఫూర్తిగా నిలుస్తున్నారు.