శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By జె
Last Modified: శుక్రవారం, 13 మార్చి 2020 (20:52 IST)

ప్రియుడితో భార్య రొమాన్స్, చూసిన భర్త కళ్ళలో కారం కొట్టిన భార్య.. ఆ తరువాత?

పండంటి కాపురం. పెళ్ళయి మూడునెలలే. ఇద్దరి మధ్యా చిన్న తగాదా చివరకు విడిపోయారు. ఒంటరిగా ఉన్న ఆ యువతి రెస్టారెంట్లో చేరింది. యజమానితో అక్రమ సంబంధం పెట్టుకుంది. భార్యను ఎంతో ప్రేమించిన భర్త ఆమెను తిరిగి ఇంటికి తీసుకురావాలనుకున్నాడు. ఆమె ఉన్న ఇంటికి వెళ్ళి చూసి షాకయ్యాడు భర్త.
 
హైదరాబాద్‌లోని లింగంపల్లి ప్రాంతం. రాజు ఫైనాన్సర్. కుటుంబ సభ్యులు కుదిర్చిన పెళ్ళి చేసుకున్నాడు అమ్మాయి రేవతి. బోరబండలో ఉండేది. డిగ్రీ పూర్తి చేసుకున్న రేవతి.. రాజులకు మూడునెలల క్రితం పెళ్ళయ్యింది. కాపురం లింగంపల్లిలో పెట్టారు.
 
మొదటి నెలరోజులు భర్తతో ఎంతో అన్యోన్యంగా ఉండేది రేవతి. ఆ తరువాత గొంతమ్మ కోర్కెలు తీర్చమని గొడవ పెట్టేది. నగలు, షికార్లు ఇలా రాజును ఇబ్బందులకు గురిచేస్తూ వచ్చింది. అయితే తన భార్యే కదా అని ఖర్చు పెడుతూ వచ్చాడు రాజు.
 
కానీ తాను ఇంట్లో లేని సమయంలో రేవతి ఎవరితోనే కలుస్తోందని అనుమానం పెట్టుకున్నాడు. ఆమె సెల్ ఫోన్‌ను పరిశీలించాడు. అందులో తన డిగ్రీ స్నేహితుడితో చాటింగ్ కనిపించింది. దీంతో ఆగ్రహంతో ఊగిపోయాడు. రేవతిపై చేయిచేసుకున్నాడు. దీంతో ఇద్దరి మధ్యా తీవ్ర వాగ్వాదం జరిగి వారంరోజుల క్రితం ఇద్దరూ విడిపోయారు. 
 
అయితే బోరబండకు తిరిగివచ్చిన రేవతి స్థానికంగా ఉన్న ఒక రెస్టారెంట్లో చేరింది. ఆ రెస్టారెంట్లో ఉన్న రాహుల్‌తో ఈమెకు పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త వివాహేతర సంబంధానికి దారితీసింది. భార్యను మర్చిపోలేని రాజు ఆమె అడ్రస్ వెతుక్కుని నిన్న ఇంటికి వెళ్ళాడు.
 
ఇంట్లో రాహుల్‌తో కనిపించింది రేవతి. భర్తను చూడగానే షాకైన రేవతి రాజు కళ్ళలో కారం కొట్టి అక్కడి నుంచి పారిపోయింది. వెంటనే తేరుకున్న రాజు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. రెస్టారెంట్ ఓనర్ రాహుల్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు రేవతికి కౌన్సిలింగ్ ఇచ్చి రాజుతో పాటు పంపించేశారు.