టీవీ 9 కొనేందుకు జీ నెట్ వర్క్... రూ.850 కోట్లకు బేరం
హైదరాబాద్ : అటు తెలంగాణాలో, ఇటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మంచి రేటింగ్ సాధిస్తున్న టీవీ 9ని చేజిక్కించుకునేందుకు జీ నెట్వర్క్ పావులు కదుపుతోంది. సంస్థ బ్రాండ్ వ్యాల్యూయేషన్ వేసే పనిలో ఉంది. అసోసియేటెడ్ బ్రాడ్ కాస్టింగ్ కంపెనీ ప్రవేట్ లిమిటెడ్(ఎ
హైదరాబాద్ : అటు తెలంగాణాలో, ఇటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మంచి రేటింగ్ సాధిస్తున్న టీవీ 9ని చేజిక్కించుకునేందుకు జీ నెట్వర్క్ పావులు కదుపుతోంది. సంస్థ బ్రాండ్ వ్యాల్యూయేషన్ వేసే పనిలో ఉంది. అసోసియేటెడ్ బ్రాడ్ కాస్టింగ్ కంపెనీ ప్రవేట్ లిమిటెడ్(ఎబిసిఎల్)లో ప్రధాన వాటాదారుడిగా ఉన్న శ్రీనిరాజు టీవీ 9ని అమ్మాలని ఎప్పటి నుంచో ప్రయత్నాలు చేస్తున్నారు.
కొద్దిరోజులు మై హోమ్ రామేశ్వరరావు ద్వారా దీని కొనుగోలుకు తెలంగాణా సీఎం కేసీఆర్ సన్నిహితులు ప్రయత్నాలు చేశారు. కానీ, అది వర్కవుట్ కాలేదు. ఇపుడు దానిని 850 కోట్ల రూపాయలకు కొనుగోలు చేసేందుకు జీ గ్రూప్ ఆఫర్ చేసినట్లు తెలిసింది. టీవీ 9 తెలుగుతో పాటు కన్నడ, మరాఠీ, గుజరాతీ, ఇంగ్లిష్, జై తెలంగాణా తదితర 7 ఛానళ్ళున్నాయి. వీటన్నింటినీ కలిపి కొనుగోలు చేయాలని జీ నెట్వర్క్ ఆలోచనలో ఉంది.
కొద్ది రోజుల క్రితమే జీ గ్రూప్ టెన్ స్పోర్ట్స్‌ని 2,500 కోట్ల రూపాయలకు సోనీకి విక్రయించింది. ఇపుడు ఆ నగదుతో ప్రాంతీయ భాషల్లో పట్టు కోసం జీ ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగానే టీవీ 9ని కొనే ప్రయత్నాలు ముమ్మరం చేసినట్లు తెలుస్తోంది.